VIDEO: జిల్లాలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్
KMM: ముదిగొండ మండలం లక్ష్మీపురం గ్రామంలో ఇవాళ BRS పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ సర్పంచ్ ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ల దాడికి దిగినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఈ ఘర్షణ వాతావరణం నెలకొన్నట్లు తెలిపారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోవడంతో గొడవ సద్దుమణిగింది.