జిల్లాలో డీజిల్ ట్యాంకర్ బోల్తా

జిల్లాలో డీజిల్ ట్యాంకర్ బోల్తా

గుంటూరు జిల్లా మేడికొండూరు వద్ద డీజిల్ ట్యాంకర్ ప్రమాదానికి గురైంది. సత్తెనపల్లి నుంచి గుంటూరు వెళ్తుండగా రోడ్డుపై ఉన్న ఎత్తైన చప్టా వంతెనను డ్రైవర్ గమనించకపోవడంతో ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ట్యాంకర్ నుంచి పెద్ద ఎత్తున్న డీజిల్ లీక్ కావడంతో స్థానికులు బకెట్లు, డబ్బాలతో డీజిల్ పట్టుకెళ్లేందుకు ఎగబడ్డారు.