ఉమ్మడి జిల్లాకు వర్ష సూచన

KRNL: ఉమ్మడి జిల్లాల్లో నేడు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని సూచించింది.