మాచర్లలో ఘనంగా సత్యసాయి జయంతి
PLD: మాచర్ల పట్టణం సొసైటీ కాలనీలోని శ్రీ సత్యసాయి విద్యా విహార్‌లో ఆదివారం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శతజయంతి ఉత్సవాల్లో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా విద్యావిహార్ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.