వారి దృష్టిలో నేనే విలన్: సుధీర్‌బాబు
సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'జటాధర'. ఈ నెల 7న మూవీ విడుదలవుతున్న నేపథ్యంలో X వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తన తదుపరి చిత్రాల గురించి తెలిపారు. రాహుల్ రవీంద్రన్‌తో ఓ సినిమా చేస్తున్నానని.. మరో 2 ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయన్నారు. జటాధర మూవీలో మీరే విలన్ కదా అని ఒకరు అడగగా.. అవును విలన్ల దృష్టిలో నేనే విలన్ అంటూ సమాధానమిచ్చారు.