బురదమయంగా మారిన బస్టాండ్

VSP: మాకవరపాలెం బస్టాండ్ బురదమయంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ప్రభుత్వం నిధులతో బస్టాండ్ పనులు మరమ్మతులు చేసినప్పటికీ వర్షం పడితే బస్టాండ్ అంతా యథావిధిగా బురదగా మారుతుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి బస్టాండ్‌లో మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు బుధవారం కోరారు.