గూడూరులో 35 మందికి సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

గూడూరులో 35 మందికి సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

TPT: గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మొత్తం రూ.23,74,944 విలువైన 35 CMRF చెక్కులను వివిధ మండలాల లబ్ధిదారులకు ఆయన క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారి వైద్య ఖర్చుల కోసం ఈ నిధులు మంజూరు అయ్యాయి. గూడూరు పట్టణం, గూడూరు రూరల్, చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాలకు చెందిన లబ్ధిదారులు ఈ సహాయం పొందారు.