రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరు మృతి

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరు మృతి

ASF: కాగజ్ నగర్ మండలంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాగజ్ నగర్ మండలంలోని పెద్దవాగు సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతిచెందారు. అలాగే మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.