కాలువలో పడి మేకల కాపరి మృతి

కాలువలో పడి మేకల కాపరి మృతి

JGL: ధర్మపురి మండలం దోనూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు ఎస్సారెస్పీ కాలువలో పడి మాసం చంద్రయ్య అనే మేకల కాపరి మృతి చెందాడు. దోనూర్ గ్రామానికి చెందిన మానం చంద్రయ్య శనివారం గ్రామ శివారు భీమన్న గుట్ట సమీపంలో మేకలు మేపుతుండగా ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నట్లు, ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు.