VIDEO: ఇంట్లోకి నాగుపాము పిల్లలు

HYD: చాదర్ ఘాట్ ప్రాంతంలో మూసి పక్కన ఉన్న ఒకరి ఇంటిలోకి నాగుపాము పిల్లలు రావడంతో భయాందోళనకు గురయ్యారు. వెంటనే చుట్టుపక్కల వారందరూ కలిసి పాములు పట్టే వారికి తెలియజేయడంతో వాటిని పట్టుకున్నట్లుగా తెలిపారు. మూసీ నది పక్కన కాంపౌండ్ వాల్ నిర్మాణం, ఫెన్సింగ్ ఆలస్యం కావడంతో, మూసి ఒడ్డుకు ఉన్న ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు కలుగుతున్నట్లు స్థానికులు తెలిపారు.