బాలసదనంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
భువనగిరి మీనానగర్‌లోని బాలసదనాన్ని కలెక్టర్ అనురాగ్ జయంతి బుధవారం తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు. పిల్లల కోరిక మేరకు మ్యూజిక్ టీచర్ను నియమించాలని, పాడైన వాటర్ ఫిల్టర్ను వెంటనే బాగు చేయించాలని సూచించారు. విద్యార్థులకు కొత్త బెడ్ షీట్లు పంపిణీ చేయాలని ఆదేశించారు.