దిండి -చించినాడ వారధిపై రాకపోకలు బంద్

దిండి -చించినాడ వారధిపై రాకపోకలు బంద్

కోనసీమ: మరో రెండు రోజులపాటు దిండి-చించినాడ వంతెనపై రాకపోకలను పూర్తిగా నిలిపివేయనున్నట్లు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదివారం తెలిపారు. 216 జాతీయ రహదారి మరమ్మత్తు పనులు గడువులో పూర్తికాని కారణంగా రాకపోకలు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.  ఈనెల 25, 26 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రాకపోకలు నిలిపివేత సమయాన్ని పొడిగించినట్లు వెల్లడించారు.