'మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక పారదర్శకంగా నిర్వహించాలి'
NRML:ఈనెల 4న ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. మంగళవారం వారు ఖానాపూర్‌లో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరగాలని సూచించారు.