ఎగువ గంగంపల్లిలో సీసీ రోడ్డుకు భూమి పూజ
సత్యసాయి: గోరంట్ల మండలం ఎగువ గంగంపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణానికి టీడీపీ మండల కన్వీనర్ బాలకృష్ణ చౌదరి శుక్రవారం భూమి పూజ చేశారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకం కింద రూ.4 లక్షలు సీసీ రోడ్డుకు మంజూరయ్యాయి. దీంతో సీసీ రోడ్డు పనులకు ఆయన భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని కన్వీనర్ తెలిపారు.