చిత్తడి నేలల పరిరక్షణకు కలెక్టర్ ఆదేశం

NDL: జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి చిత్తడి నేలల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన వెట్‌ల్యాండ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో గుర్తించిన 519 చిత్తడి భూముల్లో 10 అటవీ శాఖ పరిధిలో, మిగతా 509 ఇతర శాఖల పరిధిలో ఉన్నాయని తెలిపారు.