చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

MHBD: నెల్లికుదురు మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన గుణగంటి వెంకన్న(50) తన ద్విచక్ర వాహనంపై వెళుతుండగా, అదుపుతప్పి కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి భార్య పూలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేష్ బాబు తెలిపారు.