గాలులకు కొట్టుకు పోయిన ఇంటి పైకప్పులు

NGKL: అచ్చంపేట మండలంలోని కన్యాతండా గ్రామంలో రాత్రి ఈదురు గాలులకు 5 ఇళ్ల పైకప్పులు గాలిలో కొట్టుకొని పోయాయని దాదాపు అయిదు కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.