'NTR పట్టుదల, చంద్రబాబు విజన్ కలిస్తే లోకేష్'

కృష్ణా: చంద్రబాబు విజన్.. ఎన్టీఆర్ పట్టుదల రెండు కలగలిపిన వ్యక్తి లోకేష్ అని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. తెలుగువారు ప్రపంచంలో ఎక్కడ ఆపదలో ఉన్న వారికి నేనున్నానని ముందుకు వచ్చి లోకేష్ ఆదుకుంటున్నారు. నేపాల్ అల్లర్లలో చిక్కుకున్న తెలుగువారిని రక్షించడంలో లోకేష్ చేసిన కృషి అభినందనీయమని ప్రశంసించారు.