నేషనల్ ఫుట్ బాల్‌కు నలుగురు ఎంపిక

NGKL: ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రంలో జరగనున్న జాతీయ స్థాయి ఫుట్ బాల్ క్రీడలకు నాగర్ కర్నూల్ జిల్లా నుంచి నలుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. కల్వకుర్తిలోని మినీ స్టేడియంలో శిక్షణ పొందుతున్న వారిలో పి.అక్షర, ఆనంద వర్షిని, ఎం.వి ధ్యానాంజలి, కీర్తి ఎంపిక కావడంతో వారిని జిల్లా అదనపు కలెక్టర్ దేవ సహాయం బుధవారం అభినందించారు.