'జాతీయ రహదారుల సమస్యలు పరిష్కరించండి'

NDL: జాతీయ రహదారుల నిర్మాణం వల్ల సమీప గ్రామాల ప్రజల ఇబ్బందులను తొలగించాలని కేంద్ర మంత్రి నితిన్ గట్కరిని ఎంపీ శబరి కోరారు. ఢిల్లీలో బుధవారం ఆయన కార్యాలయంలో ఎంపీ శబరి కలిశారు. ఆమె మాట్లాడుతూ... మిడియన్ ఓపెనింగ్ ఏర్పాటుకు,ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలకు సంబంధించి పలు సమస్యలపై చర్చలు జరిపామన్నారు. అనంతరం ప్రతిపాదిత అంశాలపై మంత్రి స్పందించినట్లు ఆమె తెలిపారు.