ఏబీఎన్ రాధాకృష్ణపై వైసీపీ ఫిర్యాదు
VZM: ఏబీఎన్, ఆంద్రజ్యోతిల అదినేత రాధాకృష్ణపై గురువారం బుధరాయవలస పోలీస్ స్టేషన్‌లో మెరకముడిదాం మండల వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వైసీపీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కోట్ల విశ్వేశ్వరరావుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.