రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

NDL: గడివేముల మండల పరిధిలోని గని, సోలార్ ప్లాంట్ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆగోల ఈశ్వర్ (26) అనే యువకుడు మృతి చెందాడు. సోలార్ ప్లాంట్‌లో విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా, కుక్క అడ్డురావడంతో బైక్ అదుపుతప్పి కిందపడటంతో ఈశ్వర్ తలకు తీవ్ర గాయమైంది. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోపే మార్గమధ్యంలో అతను మృతి చెందాడు.