పుట్టపర్తిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

పుట్టపర్తిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఆయనతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి సూర్యనారాయణ రెడ్డి, ఆర్డీఓ సువర్ణ, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రామసుబ్బయ్యలు కూడా అర్జీలను స్వీకరించారు. వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.