కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతాం: సీతక్క
TG: అంగన్వాడీలకు సరుకుల సరఫరాలో జాప్యంపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మాకు కారణాలు వద్దు..10 రోజులకొకసారి కోడిగుడ్లు సరఫరా చేయాలి. నిబంధనలు అతిక్రమిస్తే కాంట్రాక్టులు రద్దు చేస్తాం. నాసిరకం గుడ్లు సరఫరా చేసి చిన్న పిల్లల జీవితాలతో ఆడుకోవద్దు. సరుకుల సరఫరాలో లోపాలు జరిగితే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతాం' అని హెచ్చరించారు.