పీఎం పాలెంలో మహిళ కిడ్నాప్ కలకలం

పీఎం పాలెంలో మహిళ కిడ్నాప్ కలకలం

విశాఖ: పీఎం పాలెంలో మహిళ కిడ్నాప్ కలకలం సృష్టించింది. ప్రమీల అనే మహిళలను ఇద్దరు దుండగులు ఎత్తుకెళ్లారు. గోపాలపట్నం తీసుకెళ్లి ఆమెపై దాడి చేశారు. వారి నుంచి తప్పించుకుని ప్రమీల పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులు పవన్, శేఖర్‌గా గుర్తించిన పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. కిడ్నాప్‌కు ఆర్థిక వ్యవహారాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.