జీపీ ఎన్నికలు.. పాలమూరు బస్టాండ్ కిటకిట
MBNR: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనుండటంతో, హైదరాబాద్, ముంబైకి వలస వెళ్లిన కార్మికులు ఓటు వేయడానికి సొంత గ్రామాలకు చేరుకుంటున్నారు. దీంతో శనివారం రాత్రి మహబూబ్‌నగర్ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. స్వస్థలాలకు వెళ్లడానికి బస్సులు సరిపోకపోవడంతో కొందరు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి తీవ్ర ఇబ్బందులు పడ్డారు.