ప్రమాదం.. డివైడర్‌పైకి ఎక్కిన కారు..!

ప్రమాదం.. డివైడర్‌పైకి ఎక్కిన కారు..!

HYD: శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్డులో కారు బీభత్సం సృష్టించింది. కృష్ణానగర్- అమీర్‌పేట వెళ్తున్న క్యాబ్ డ్రైవర్ ఫోన్ చూస్తూ డివైడర్‌పైకి ఎక్కించాడు. ఈ క్రమంలో పక్కనే వెళ్తున్న బైకర్‌ను ఢీకొట్టడంతో కారు ముందు భాగం ధ్వంసమైంది. సమాచారం అందుకున్న మధురానగర్ పోలీసులు క్రేన్ సాయంతో వాహనాన్ని తొలగించి, ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.