VIDEO: తుళ్లూరు సీడ్ యాక్సిస్ రహదారిపై రోడ్డు ప్రమాదం
GNTR: తుళ్లూరు(M) రాయపూడి సీడ్ యాక్సిస్ రహదారిపై మరో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం మేరకు తుళ్లూరు వైపు నుంచి వెళ్తున్న స్విఫ్ట్ కారు, మందడం వైపు నుంచి వస్తున్న మరో ఎలక్ట్రిక్ కార్ ఎదురుగా రియల్ ఎస్టేట్ సెంటర్ సమీపంలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులోని వారికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించి మరింత వివరాలు తెలియాల్సి ఉంది.