బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి: SP
ADB: పీఎస్‌కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం పోలీసు ముఖ్య కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుండి 38 మంది వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులకు సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.