'నీటి సంరక్షణ మనందరి బాధ్యత'
W.G: నీటి వృథాను అరికట్టడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యతని RWS ఏఈఈ శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం సిద్ధాంతంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. చెరువులు, కాలువలను కలుషితం చేయకుండా వాటిని కాపాడుకోవాలని సూచించారు. ఇంకుడు గుంతల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణ ద్వారా భూగర్భ జలాలను పెంపొందించుకోవచ్చని వివరించారు.