సర్పంచిగా పోటి చేస్తున్న ఎంబీఏ అమ్మాయి
MHBD: నర్సింహులపేట మండలం వస్త్రంతండా గ్రామ పంచాయతీ ఇండిపెండెంట్ సర్పంచి అభ్యర్థిగా ఎంబీఏ, బీఈడీ విద్యార్థిని అఖిల బరిలో నిలిచారు. అఖిలను గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎంబీఏ పూర్తి చేసి కాకతీయ యూనివర్సిటీలో బీఈడీ చదువుతూ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఆమె చెప్పారు.