'ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించాలి'
BPT: తెలుగు జాతి ఉన్నంతవరకు NTR పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని MLA నరేంద్ర వర్మ అన్నారు. ఇవాళ పిట్టల వాని పాలెం మండలంలో TDP 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించి NTR చిత్రపటానికి నివాళులర్పించారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించి పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించేలా కృషి చేశారన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగిసాగించాలని పిలుపునిచ్చారు.