మొంథా తుఫాన్ ముప్పు.. రైతన్నల పరేషాన్!
MDK: మొంథా తుపాన్ ప్రభావం వల్ల మెదక్ జిల్లాలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. వర్షాలు, గాలుల దెబ్బకు పంటలకు భారీ నష్టం సంభవించే అవకాశం ఉంది. ఇటీవలే వర్షాలతో మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు వరి, పత్తి పంటలపై తుపాన్ ముప్పు మరింత పెరిగింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు వర్షాలతో నష్టపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.