VIDEO: ఫోన్ మాట్లాడుతుండగా.. పిడుగు పడి వ్యక్తి మృతి

KMM: ఫోన్ మాట్లాడుతుండగా.. పిడుగు పడి వ్యక్తి మృతి చెందిన ఘటన సత్యనారయణపురంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లి మండంలోని సత్యనారయణపురంలో పొలం పనులు చేస్తున్న రైతు మహేష్ ఫోన్ మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా ఆయనపై పిడుగు పడడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.