వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు

వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు

CTR: పుంగనూరులో గురు పౌర్ణమి వేడుకలు గురువారం వైభవంగా జరుగుతున్నాయి. పట్టణంలోని స్థానిక కొత్తయిండ్లులోగల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో భక్తుల రద్దీ నెలకొంది. వేకువజాము కాగడ హారతి, ధునిపూజతో పూజలు ప్రారంభమయ్యాయి. శ్రీ సాయినాథుని మూల విగ్రహాన్ని అభిషేకించి, అలంకరించి పూజలు చేశారు. అనంతరం భక్తులకు సాయిబాబా దర్శన భాగ్యం కల్పించారు.