ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

SKLM : పొందూరు పట్టణంలోని శ్రీ సత్య సాయి బాబా మందిరంలో మంగళవారం ఓ ప్రైవేట్ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. 170 మంది రోగులకు వైద్యులు ఆరోగ్య పరీక్షలు చేశారు. అనంతరం సత్యసాయి సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ.. శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈ తరహా సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.