'ప్రజా దర్బార్'లో పాల్గొన్న ఎమ్మెల్యే
KKD: రౌతులపూడి మండలం లచ్చిరెడ్డిపాలెంలో నిర్వహించిన 'ప్రజా దర్బార్' కార్యక్రమంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పాల్గొన్నారు. రహదారులు, తాగునీరు, పింఛన్లు వంటి సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. కొన్ని సమస్యలను అధికారులు అక్కడికక్కడే పరిష్కరించగా, మిగిలిన వాటిని త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు.