పూల కోసం వెళ్ళిన వ్యక్తి గల్లంతు

పూల కోసం వెళ్ళిన వ్యక్తి గల్లంతు

VKB: చెరువులో తామర పూల కోసం వెళ్లి వ్యక్తి గల్లంతయ్యాడు.దోమ మండలం ఉదన్ రావుపల్లి గ్రామానికి చెందిన బాలయ్య(60) మంగళవారం పరిగి మండలం మిట్టకోడూర్ గ్రామ చెరువులో తామర పూల కోసం దిగాడు.పూల కోసం కొంత దూరం ఈదుకుంటూ వెళ్ళి కొద్దిసేపటికి చెరువులో గల్లంతయ్యాడు. రేపు జరగబోయే వినాయక చవితి పండుగ కోసమని చెరువులో తామర పువ్వుల కోసం వెళ్లినట్లు కుటుంబీకులు తెలిపారు.