VIDEO: రేషన్ పంపిణీ.. గోధుమలు రాలే..?

VIDEO: రేషన్ పంపిణీ.. గోధుమలు రాలే..?

MDCL: బోడుప్పల్, ఉప్పల్ ప్రాంతాల్లో రేషన్ పంపిణీలో గోధుమలు అందడం లేదని రేషన్ కార్డు దారులు తెలిపారు. ప్రతి నెల అందాల్సిన గోధుమలు ఈసారి ఇవ్వలేదని వారు వాపోయారు. ఈ విషయంపై డీలర్లను ప్రశ్నించగా, ఈ నెలకు గోధుమల సరఫరా రాలేదని సమాధానం ఇచ్చినట్లు పేర్కొన్నారు. దీంతో లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు.