VIDEO: ఘనంగా హోలీ పండుగ సంబరాలు..!
ADB: ఆదిలాబాద్ పట్టణంలో హోలీ పండుగ సంబరాలు మంగళవారం తెల్లవారుజాము నుంచే ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పట్టణ ప్రజలు ఒకరిపై ఒకరు రంగులు వేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. బ్యాండ్ మేళాలకు అనుగుణంగా సందడి చేస్తూ ఆనందంగా గడిపారు. కృత్రిమ రంగులను కాకుండా సహజ సిద్ధమైన రంగులను వాడాలని వైద్యులు సూచిస్తున్నారు.