CNG కొరత.. సెల్ టవర్ ఎక్కిన ఆటో డ్రైవర్లు
HYD: CNG కొరతపై నగరంలోని ఆటో డ్రైవర్లు ఆందోళనకు చేపట్టారు. ఈ క్రమంలో అత్తాపూర్‌లో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ మేరకు ముగ్గురు ఆటో డ్రైవర్లు సెల్ టవర్ ఎక్కడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అలాగే, కొంత మంది రోడ్డుపై బైఠాయించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. CNG కొరతతో ఉపాధి కోల్పోతున్నామని, ఈ కొరతను తీర్చాలని డిమాండ్ వారు చేస్తున్నారు.