ముప్పారంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
NLG: ముప్పారంలో రూ.15 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను సర్పంచ్ ఆలంపల్లి రోజా కృష్ణ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా అభివృద్ధికి కృషి చేస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గణపురం కొండలు, మేరెడ్డి వెంకటరమణ, భాస్కరి నారాయణ, కంచి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.