పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ నాటు తుపాకీ

VZM: వేపాడ మండలం సోంపురం గ్రామం గొర్లె ఈశ్వరరావు ఇంటిని తనిఖీ చేయగా లైసెన్సు లేని నాటుతుపాకీ లభ్యమైనట్లు ఎస్.కోట గ్రామీణ సీఐ ఎల్.అప్పలనాయుడు గురువారం తెలిపారు. నాటుతుపాకీని, వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. తుపాకీ అమ్మిన బంగారయ్యను అరెస్టు చేసి, ఇద్దరిపై ఆయుధ చట్టప్రకారం కేసు నమోదు చేసి, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.