రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు

రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు

SRCL: ఇల్లంతకుంట మండలంలో గురువారం రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఒక లారీ, ఒక ట్రాక్టర్‌ను పట్టుకొని సీజ్ చేసినట్లు ఎం.వి.ఐ. వంశీధర్ తెలిపారు. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలను రోడ్లపై తిప్పరాదని ఆయన సూచించారు. ఈ తనిఖీలలో పీసీ ప్రశాంత్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.