రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ
AKP: పాయకరావుపేట మండలం నామవరంలో గురువారం ఆర్.ఐ. త్రినాథ్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. టీడీపీ మండల అధ్యక్షులు చించెలపు ప్రదీప్, పార్టీ పట్టణ అధ్యక్షుడు వరహాల బాబు మాట్లాడుతూ.. 699 మంది రైతులకు కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేసామన్నారు. రాజముద్రతో పాస్ పుస్తకాలు అందజేస్తున్నామన్నారు.