నేడు గుజరాత్‌లో ప్రధాని మోదీ పర్యటన
ప్రధాని మోదీ ఇవాళ గుజరాత్‌లో పర్యటించనున్నారు. భారతదేశ ఏకీకరణలో కీలక పాత్ర పోషించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నిర్వహించే రాష్ట్రీయ ఏక్తా దివస్ (జాతీయ ఐక్యతా దినోత్సవం) వేడుకల్లో మోదీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పటేల్ విగ్రహం వద్ద నివాళులర్పించి, ఐక్యత సందేశాన్ని ఇచ్చే అవకాశం ఉంది.