దరఖాస్తులను వెంటనే పరిష్కరించండి: GWMC కమిషనర్
WGL: పీఎం స్వనిధి పథకానికి సంబంధించి పెండింగ్లో ఉన్న 5,600 దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ బ్యాంకర్లను ఆదేశించారు. బల్దియా పరిధిలో రూ.15,000 నుంచి రూ.50,000 వరకు రుణాల కోసం దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని డిసెంబర్ 2లోగా పూర్తి చేయాలని మెప్మా అధికారులతో జరిగిన సమావేశంలో సూచించారు.