అల్లూరి, మన్యం ఘటనలపై స్పందించిన మంత్రి

అల్లూరి, మన్యం ఘటనలపై స్పందించిన మంత్రి

AP: అల్లూరి జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా ఘటనలపై మంత్రి సంధ్యారాణి స్పందించారు. అల్లూరి జిల్లా పడవ ప్రమాదంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పడవ ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరమని అన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. మన్యం జిల్లా జంఝావతి రబ్బరు డ్యాంలో గల్లంతైన ముగ్గురి గురించి ఆరా తీశారు. సహయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.