గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ దుకాణాలు: దువ్వాడ

SKLM: టెక్కలి నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుందని, గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం బెల్టు షాపులు నిర్వహిస్తూ తద్వారా అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. శనివారం టెక్కలిలో మీడియాతో మాట్లాడుతూ.. మద్యం షాపుల నుంచి రూ.56వేలు ఎక్సైజ్, పోలీసులకు లంచాలు ఇస్తున్నట్లు మద్యం దుకాణాల యజమానులు చెబుతున్నారన్నారు.