నాలుగు రోజుల నుంచి కొనసాగుతున్న ధర్నా
NRML: భైంసా మున్సిపల్ కార్మికుల ధర్నాను సీఐటీయూ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అగ్గిమల్ల స్వామి, రాష్ట్ర కమిటీ సభ్యులు దర్శనాల నాగేష్, నిర్మల్ జిల్లా సీఐటీయూ కార్యదర్శి బొమ్మెన సురేష్ రాష్ట్ర ఉపాధ్యక్షులు S.నవీన్ కుమార్ కార్మికులకు మద్దతు తెలియజేశారు. ఈ సందర్బంగా బొమ్మెన సురేష్ మాట్లాడుతూ.. కార్మికుల రెండు నెలల పెండింగ్ జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.